విదేశీ భాషలు, ముఖ్యంగా జర్మన్ భాషను నేర్చుకుంటున్న విద్యార్థులు క్రమశిక్షణ, నిరంతర సాధనతో ముందుకు సాగాలి. అలా చేస్తే అంతర్జాతీయ స్థాయిలో ఉన్న ఉపాధి అవకాశాలను మన యువత సద్వినియోగం చేసుకోగలుగుతారు మంత్రి గడ్డం వివేక్ .
టామ్‌కామ్ (TOMCOM) కార్యాలయంలో జర్మన్ భాషా శిక్షణ పొందుతున్న విద్యార్థులు, అధ్యాపకులతో సమావేశమయ్యారు.
జర్మనీలో ఉద్యోగాలు పొందాలనే లక్ష్యంతో ఉన్న యువత కోసం టామ్‌కామ్ జర్మన్ భాషా శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. మన భారతదేశంలో నర్సింగ్, ఇంజినీరింగ్ తదితర రంగాల్లో ఉపాధి అవకాశాలు ఉన్నప్పటికీ, జర్మనీలో పనిచేసే వారికి లభించే వేతనాలు మన కరెన్సీ విలువతో పోలిస్తే ఎంతో అధికంగా ఉంటాయి.
కొత్త భాషను నేర్చుకుని జర్మనీ వంటి దేశాల్లో ఉద్యోగాలు సాధించడం మన యువతకు ఒక గొప్ప అవకాశం
ఇటీవల మంచిర్యాల జిల్లా మందమర్రిలో ప్రారంభించిన జర్మన్ భాషా తరగతులకు విశేష స్పందన లభించడం ఆనందంగా ఉంది అని అన్నరు. దాదాపు 200 మంది యువత ఈ కోర్సులో చేరడం చాలా సంతోషాన్ని కలిగించింది అని అన్నరు. అక్కడి అధ్యాపకులు కూడా ఎంతో ప్రతిభావంతంగా విద్యార్థులకు శిక్షణ అందిస్తున్నారు.
విద్యార్థులు సమర్థవంతంగా భాషను నేర్చుకునేలా వారి హాజరును నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. విద్యార్థులు ఒక్క తరగతిని కూడా మిస్ కాకుండా క్రమం తప్పకుండా హాజరవుతూ, భాషలో ఉన్నత స్థాయి ప్రావీణ్యాన్ని సాధించాలి. ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో తరగతులకు హాజరై భాషపై పూర్తి పట్టు సాధించాలి.
నా వ్యక్తిగత అనుభవంలో కూడా నిరంతర సాధన, పట్టుదలతోనే తెలుగు భాషను నేర్చుకున్నాను. ఏ భాషనైనా నేర్చుకోవాలంటే నిరంతర అభ్యాసమే విజయానికి మూలం.ఇలాంటి భాషా శిక్షణ కార్యక్రమాలు యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలను అందించడంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో విజయవంతమైన కెరీర్‌ను నిర్మించుకునేందుకు దోహదపడతాయని అన్నరు.

