Wednesday, June 24, 2026

Buy now

జిల్లా యువత మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి:ములుగు జిల్లా కలెక్టర్

మెగా జాబ్ మేళా విజయవంతానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
ములుగు నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యం గా జూన్ 17న జరిగే మెగా జాబ్ మేళా నిర్వహణకు సమన్వయంతో పనిచేయాలి జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అని అన్నరు , జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకాన్ తో కలిసి ఇంచర్లలోని ఎం.ఆర్. ఫంక్షన్ హాల్‌లో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల నుంచి నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో జాబ్ మేళాకు హాజరయ్యే అవకాశం ఉన్నందున వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. కార్యక్రమ ప్రాంగణంలో తాగునీరు, భోజనం, కూర్చునే వసతి, పార్కింగ్, షేడ్ తదితర ఏర్పాట్లు పూర్తి స్థాయిలో ఉండేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

Related Articles

spot_img

Most Popular