Friday, August 14, 2026

Buy now

కార్మికుల కనీస వేతనం అమలు చేయాలి: సిఐటియు డిమాండ్

రాజన్న సిరిసిల్ల : మున్సిపల్ కార్మికులకు నెలకు 26వేల రూపాయల కనీస వేతనం అమలు చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు మూషం రమేష్, మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి గుర్రం అశోక్ డిమాండ్ చేశారు.

తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్, సిఐటియు ఆధ్వర్యంలో గురువారం నాడు వేములవాడ మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన దీక్ష చేపట్టారు.

తాత్కాలిక పద్ధతిని పనిచేస్తున్న కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని, నెలకు 26 వేల రూపాయల కనీస వేతనం చెల్లించాలని, చనిపోయిన, 60 సంవత్సరాలు పైబడిన కార్మికుల స్థానంలో వారి వారసులకు ఉద్యోగ అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.

పిఎఫ్, ఈఎస్ఐలు సక్రమంగా చెల్లించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపల్, పంచాయతీ కార్మికుల సమస్యలపై స్పందించకపోవడం బాధాకరమని ఈ సందర్భంగా వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ పట్టణ అధ్యక్షుడు సరిపల్లి నరేష్, ప్రధాన కార్యదర్శి దొబ్బల లచ్చయ్య, ఉపాధ్యక్షుడు సుంకపాక పరశురాములు, సావనపల్లి శ్రీనివాస్, రాచకొండ శ్రీనివాస్, ఎండి అజ్జు, బొడ్డు శ్రీనివాస్, గాజుల వజ్రమ్మ, వావిలాల లక్ష్మి, పుప్పాల మమత, వావిలాల రాధ, కార్మికులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular