వరంగల్: కాశీబుగ్గ సాయి వీధిలో అపరిశుభ్ర వాతావరణంలో నడుస్తున్న అక్రమ పచ్చడి తయారీ కేంద్రంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. తనిఖీల్లో కుళ్లిపోయిన టమోటా, మామిడి, నిమ్మకాయలు, ఉసిరి, అల్లం–వెల్లుల్లి పేస్ట్‌తో తయారవుతున్న కల్తీ పచ్చడి ముడిసరుకులు గుర్తించారు.
ఈ కేంద్రం నుంచి చిన్న ప్యాకెట్లుగా పచ్చడి తయారు చేసి స్థానిక దుకాణాలకు సరఫరా చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. అరికెల శ్రీనివాస్ (51)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సుమారు రూ.2.25 లక్షల విలువైన కల్తీ నిల్వలను స్వాధీనం చేసుకుని, నిందితుడిని ఇంతేజార్‌గంజ్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు.

