శిల్పకళా వేదికలో ఈగల్ ఫోర్స్ & వికలాంగులు, సీనియర్ సిటిజన్లు మరియు ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకు వ్యతిరేక దినోత్సవ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హాజరవడం జరిగింది .
ఈ కార్యక్రమంలో డీజీపీ సీవీ ఆనంద్ , సందీప్ కుమార్ శాండిల్య , సైబరాబాద్ సీపీ , అనితా రామచంద్రన్ , సినీ నటుడు రామ్ పోతినేని , సినీ నటి మీనాక్షి చౌదరి , ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
కార్యక్రమంలో భాగంగా మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని ప్రతిజ్ఞ చేయడం జరిగింది . అనంతరం యువతకు అవగాహన కల్పిస్తూ, మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలను వివరించి, మత్తు పదార్థాలకు “నో” చెప్పి ఆరోగ్యకరమైన, బాధ్యతాయుతమైన సమాజ నిర్మాణానికి అందరం కలిసి పనిచేయాలని పిలుపు ఇవ్వడం జరిగింది.

