మంచిర్యాల: ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన డీ-అడిక్షన్ కేంద్రాన్ని మంచిర్యాల డీసీపీ భాస్కర్ సందర్శించారు.మత్తు పదార్థాలకు బానిసలై మానసిక,శారీరక ఇబ్బందులతో బాధపడుతున్న వారికి ఈ కేంద్రంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో వైద్య చికిత్స, కౌన్సెలింగ్ అందిస్తున్నారు.ఈ సందర్భంగా చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితి,వారికి అందుతున్న వైద్య సేవల గురించి డీసీపీ అడిగి తెలుసుకున్నారు. అనంతరం రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా ఆధ్వర్యంలో బాధితులకు క్యారమ్ బోర్డులు,చెస్ బోర్డులు,ఇతర ఆటవస్తువులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, మంచిర్యాల టౌన్ ఇన్‌స్పెక్టర్ ప్రమోద్‌రావు,ఎస్‌ఐ ఆది మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.

