Thursday, July 16, 2026

Buy now

డ్రగ్స్‌కు ‘నో’ చెప్పండి… ఆరోగ్యకరమైన జీవితానికి ‘యెస్’ చెప్పండి:జిల్లా కలెక్టర్.

రామగుండం : డ్రగ్స్,గంజాయి రహిత మంచిర్యాలే లక్ష్యం… గంజాయి నిర్మూలనలో ప్రజల సహకారం కీలకం: మంచిర్యాల డీసీపీ భాస్కర్.రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు,మంచిర్యాల ఏసీపీ ఆర్.ప్రకాష్ పర్యవేక్షణలో, మంచిర్యాల టౌన్ ఇన్‌స్పెక్టర్ ప్రమోద్‌రావు ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గంజాయి,ఇతర మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజల్లో,ముఖ్యంగా యువతలో అవగాహన కల్పించే ఉద్దేశంతో 2కే రన్ నిర్వహించారు.

ఈ రన్ మంచిర్యాల జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మైదానం నుంచి ప్రారంభమై అంబేద్కర్ చౌరస్తా వరకు కొనసాగింది.ఈ కార్యక్రమానికి మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.డీసీపీ ఎ.భాస్కర్ మాట్లాడుతూ,రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తున్న యాంటీ డ్రగ్ అబ్యూస్ అవగాహన కార్యక్రమంలో భాగంగా మంచిర్యాలలో ఈ అవగాహన ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు.

జిల్లా కలెక్టర్‌తో పాటు జిల్లా యంత్రాంగం,వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, పోలీసులు,యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని డ్రగ్స్ వ్యతిరేక సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారని చెప్పారు.గంజాయి, ఇతర మాదకద్రవ్యాలు సమాజానికి మహమ్మారిగా మారుతున్నాయని, ముఖ్యంగా యువత వాటి బారిన పడకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మాదకద్రవ్యాల వినియోగం,విక్రయం లేదా అక్రమ రవాణాకు సంబంధించిన ఎలాంటి సమాచారం తెలిసినా వెంటనే డయల్-100 లేదా టోల్‌ఫ్రీ నంబర్ 1908కు తెలియజేయాలని కోరారు.సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.

మంచిర్యాల జిల్లాను మాదకద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు జిల్లా యంత్రాంగం,పోలీసు శాఖ సమన్వయంతో నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ లక్ష్య సాధనలో ప్రజల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు.జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ,రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మాదకద్రవ్యాల నిర్మూలనపై విస్తృత అవగాహన కల్పించేందుకు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మైదానం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ అవగాహన ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో డీసీపీ, కమాండెంట్, అగ్నిమాపక శాఖ అధికారులు,పోలీసు సిబ్బంది,యువత, విద్యార్థులు,వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొని డ్రగ్స్ వ్యతిరేక సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారని చెప్పారు.మాదకద్రవ్యాల వినియోగం లేదా అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే టోల్‌ఫ్రీ నంబర్ 1908కు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. మాదకద్రవ్యాలకు బానిసైన వారి కోసం డీ-అడిక్షన్ కేంద్రాల ద్వారా వైద్య చికిత్స, కౌన్సెలింగ్, పునరావాస సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

అదే సమయంలో డ్రగ్స్ అక్రమరవాణా, విక్రయాలకు పాల్పడే పెడ్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటికే పలువురిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపినట్లు వెల్లడించారు.మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన, సురక్షితమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని,”డ్రగ్స్‌కు ‘నో’ చెప్పండి… జీవితానికి ‘యెస్’ చెప్పండి” అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో 13వ బెటాలియన్ కమాండెంట్, మంచిర్యాల ఏసీపీ ఆర్.ప్రకాష్, మంచిర్యాల టౌన్ ఇన్‌స్పెక్టర్ ప్రమోద్‌రావు,పోలీసు సిబ్బంది,విద్యార్థులు, యువత,వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular