Saturday, June 27, 2026

Buy now

జీలకుంట గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం:ప్రభుత్వ విప్

కాంగ్రెస్ పార్టీలో చేరిన జీలకుంట గ్రామ సర్పంచ్ మంగ గారు…
రూ. 15.28 లక్షల DMFT నిధులతో నిర్మించిన మహిళా సమాఖ్య భవనం ప్రారంభం…
విద్యాలయాల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట…
భూదాత దివంగత మల్లారెడ్డి పేరు చిరస్థాయిగా నిలిచేలా నామకరణం…
ఇంటి స్థలం ఉన్న ప్రతి అర్హునికి రూ. 5 లక్షల ఇందిరమ్మ ఇల్లు…

పెద్దపల్లి : ఓదెల మండలం జీలకుంట గ్రామంలో రూ. 15.28 లక్షల డీఎంఎఫ్‌టీ (DMFT) నిధులతో నూతనంగా నిర్మించిన మహిళా సమాఖ్య భవనాన్ని శుక్రవారం రోజున ప్రారంభించిన తదుపరి జీలకుంట గ్రామ బీజేపీ పార్టీకి సంబంధించిన సర్పంచ్ రాగిడి మంగ శ్రీనివాస్ రెడ్డి తో పాటు వార్డు సభ్యులు బంగారి పద్మా శ్రీనివాస్ మరియు వారి అనుచరులకు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు.

తదుపరి ఓదెల మండల కేంద్రంలోని KGBV విద్యాలయంలో 20 లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించిన అదనపు డార్మిటరీ మరియు టాయిలెట్స్ ను ప్రారంభించిన ప్రభుత్వ విప్ విజయరమణ రావు.

గ్రామాభివృద్ధికి, మహిళల ఆర్థిక స్వావలంబనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ​ఆనాడు మహిళా సంఘం భవన నిర్మాణానికి 2.5 గుంటల స్థలాన్ని దానం చేసిన దివంగత మల్లారెడ్డి త్యాగాన్ని ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణ రావు కొనియాడారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన పేరు చిరస్థాయిగా నిలిచేలా ఈ మహిళా భవనానికి ‘భూదాత మల్లారెడ్డి’ పేరు పెట్టాలని నిర్ణయించినట్లు ప్రకటించారు.

మహిళల సౌకర్యార్థం ఈ భవనానికి కాంపౌండ్ వాల్, మెట్లు, ప్రత్యేక టాయిలెట్ల నిర్మాణానికి అదనపు నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పనులను ఆగస్టు 15 లోపు ప్రారంభించి, దసరా పండుగ నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ​

జీలకుంట నుండి పందిల్ల వీళ్ళే రోడ్డు పనులను త్వరలోనే పూర్తిస్థాయి బీటీ రోడ్డుగా మారుస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. గత రెండున్నర ఏళ్లలో గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు రూ. కోటికి పైగా నిధులు మంజూరు చేశామని, రాబోయే రోజుల్లో ప్రతి గల్లీలోనూ రోడ్డు ఉండేలా చూస్తామన్నారు.

పాఠశాల స్థలం అన్యాక్రాంతం కాకుండా నిర్మిస్తున్న కాంపౌండ్ వాల్ పనులను రాబోయే రెండు నెలల్లో పూర్తి చేయిస్తామన్నారు. అలాగే పెద్దపల్లి కి వచ్చే ప్రధాన రహదారి పనులను పూర్తి చేసి, వారం రోజుల్లో నిధులు క్లియర్ చేసి సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.

Related Articles

spot_img

Most Popular