Saturday, June 27, 2026

Buy now

భాగ్యరాజ్ మృతికి తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ తీవ్ర సంతాపం

తెలుగు, తమిళ సినీ పరిశ్రమలో దర్శకుడు, నటుడు, రచయితగా విశిష్ట సేవలు అందించిన ప్రముఖ సినీ దిగ్గజం కె. భాగ్యరాజ్ మరణవార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, మేనేజింగ్ డైరెక్టర్, సమాచార పౌరసంబంధాలశాఖ స్పెషల్ కమిషనర్ డాక్టర్ జి. ముకుంద రెడ్డి సంయుక్త ప్రకటనలో ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.

భారతీయ సినీ రంగంలో తనదైన కథన శైలి, అద్భుతమైన స్క్రీన్‌ప్లేతో ప్రత్యేక గుర్తింపు పొందిన భాగ్యరాజ్ ను సినీ ప్రపంచం “కింగ్ ఆఫ్ స్క్రీన్‌ప్లే”గా గౌరవించిందన్నారు. దర్శకుడిగా, నటుడిగా, రచయితగా అనేక చిత్రాల ద్వారా ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు.తెలుగు ప్రేక్షకులతో కూడా ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉందని, ఆయన సినీ సేవలు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తాయని తెలిపారు.

ఈ సందర్భంగా భాగ్యరాజ్ కుటుంబ సభ్యులకు, అభిమానులకు, తమిళ సినీ పరిశ్రమకు తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

Related Articles

spot_img

Most Popular