Thursday, July 16, 2026

Buy now

గర్భస్థ పిండ లింగ నిర్ధారణ చేయు ప్రైవేటు హాస్పిటల్ లపై నిగా పెట్టాలి : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి

పెద్దపల్లి,(ప్రతినిధి): జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కే ప్రమోద్ కుమార్ ఆధ్వర్యంలో తన చాంబర్లో నేడు పిసిపీఎన్డిటి డిస్టిక్ లెవెల్ అడ్వైజరి మీటింగు నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మాట్లాడుతూ గర్భస్థ పిండ లింగ నిర్ధారణ చేయు ప్రైవేటు హాస్పిటల్ లపై నిగా పెట్టాలని ఎవరైనా అతిక్రమించినట్లయితే వారి పైన చట్టరీత్యా చర్యలు తీసుకోబడునని తెలిపారు.

అంతకుముందు ప్రోగ్రాం అధికారిని డాక్టర్ లక్ష్మి భవాని మాట్లాడుతూ సమావేశoకు వచ్చిన అతిథులను ఆహ్వానించి పిసిపీ యాక్ట్ మరియు సర్వీసెస్ గురించి వివరిస్తూ లింగ నిర్ధారణ పరీక్షలు చేయకుండా ఉండడానికి ప్రతినెల వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది మేము కలిసి ఫారం ఎఫ్ ఆడిట్ చేయడం జరుగుతుందని తెలిపారు.

కె రాజగోపాల్ ఐఆర్సిఎస్ కె రాజగోపాల్ మాట్లాడుతూ లింగ నిష్పత్తి వ్యత్యాసం అన్న ప్రాంతాలలో అధికంగా మానిటరింగ్ చేసి ఎవరైనా గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలు చేసినట్లయితే వారి పైన చట్టరీత్య చర్యలు తీసుకోవాలని సూచించారు. డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ శ్రీరాములు మాట్లాడుతూ వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి, ప్రైవేట్ హాస్పిటల్స్ సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వవలసిన అవసరం ఉన్నదని తెలిపారు.

అలాగే సంబంధిత డిపార్ట్మెంట్లు అన్నీ కూడా సమన్వయంతో పనిచేసి ప్రజలలో చైతన్య కల్పించి ఆడ మగ అనే బేదం లేకుండా అవగాహన చేయాలని కోరారు. అలాగే డెకాయ్ ఆపరేషన్ ద్వారా గర్భస్థ పిండ లింగ నిర్ధారణ చేయు హాస్పిటల్ లను క్షుణ్ణంగా పరిశీలించాలని తెలిపారు.

డిపిఆర్ఓ జగన్ మాట్లాడుతూ గర్భస్థ పిండ లింగ నిర్ధారణ కార్యక్రమాలపై పత్రికాముఖంగా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా విస్తృతంగా అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గైనకాలజిస్ట్, పీడియాట్రిషన్, డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ కిరణ్ కుమార్, డిప్యూటీ డెమో అనిల్ కుమార్, ఎన్జీవో సంస్థల ప్రెసిడెంట్లు స్వప్న, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular