పెద్దపల్లి,ప్రతినిధి : ఆధ్యాత్మిక చింతనతో మనోవికాసం పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి కలుగుతుందని అన్నారు. శ్రీ రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాల్లో పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
పెద్దపల్లి మండలంలోని బొంపల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ రంగనాథ స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా, గ్రామ ప్రజల ఆహ్వానం మేరకు పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, ఆలయ కమిటీ సభ్యులు దాసరి మనోహర్ రెడ్డి కి ఘన స్వాగతం పలికి, శాలువాతో సన్మానించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. శ్రీ రంగనాథ స్వామి వారి దివ్య ఆశీస్సులు ప్రతి కుటుంబంపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మర్కు లక్ష్మణ్, పట్టణ అధ్యక్షుడు ఉప్పు రాజకుమార్, బిఆర్ఎస్ నాయకులు సలేంద్ర రాములు యాదవ్, కొమరేష్, అంజయ్య, సతీష్, సడి, లింగయ్య, శంకరయ్య, చంటి హరీష్, కార్యకర్తలు పాల్గొన్నారు.

