కొడంగల్ నియోజకవర్గంలో డూప్లికేట్, కర్ణాటక ఓట్లు ఉన్నాయని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. కొడంగల్‌లో 22 వేలకుపైగా డూప్లికేట్ ఓట్లు, 11 వేల కర్ణాటక ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఈ ఓట్లపై ఎన్నికల సంఘం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
బోధన్‌లో వేల సంఖ్యలో ఓట్లు తొలగించినా, కొడంగల్‌లో తక్కువగా తొలగించడంపై అనుమానాలు ఉన్నాయని అన్నారు. అంతర్రాష్ట్ర డూప్లికేట్ ఓట్లను తొలగించే పక్కా విధానం ఉండాలని, “వన్ నేషన్.. వన్ ఎలక్షన్.. వన్ ఓటు” విధానం అమలు చేయాలని కోరారు.

