Thursday, July 16, 2026

Buy now

యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం

హైదరాబాద్ :రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డి అధ్యక్షతన నేడు ఇందిరా భవన్‌లో రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర ఇన్‌చార్జ్ ఖాలిద్ , సహ ఇన్‌చార్జ్‌లు రోషిని జైస్వాల్ ,భవ్య హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఇటీవల రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించి, రాబోయే కార్యక్రమాల అమలుపై దిశానిర్దేశం చేశారు.

అనంతరం రాష్ట్ర అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డి గారు మాట్లాడుతూ, ప్రతిపక్ష నాయకులు శ్రీ రాహుల్ గాంధీ పిలుపు మేరకు జాతీయ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఉదయ్ భాను చిబ్ నాయకత్వంలో నీట్ పేపర్ లీకేజీకి నిరసనగా “ఛాత్రోన్ కీ గూంజ్” కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా సమన్వయంతో విజయవంతం చేయాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

అదేవిధంగా జాతీయ యువజన కాంగ్రెస్ తీసుకొచ్చిన నూతన నియమ నిబంధనలను అందరికి వివరించి వీటిని ప్రతి ఒక్కరూ తూచా తప్పకుండా పాటించాలని సూచించారు.సంబధిత ఎమ్మెల్యే/నియోజకవర్గ ఇంచార్జీ లతో చర్చించి జూలై 15 లోగా డివిజన్ మరియు గ్రామ కమిటీలు పూర్తి చేయాలని ఆదేశించారు.

Related Articles

spot_img

Most Popular