Thursday, July 16, 2026

Buy now

10న విద్యాసంస్థల బంద్:AISF

ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో: వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జూలై 10న నిర్వహించనున్న రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయాలని AISF నాగర్‌కర్నూల్ జిల్లా కార్యదర్శి బలముల ప్రేమ్ కుమార్ పిలుపునిచ్చారు.

సోమవారం అచ్చంపేట నియోజకవర్గంలోని ప్రగతి జూనియర్ కళాశాలలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలన్నారు. ఈ బంద్‌లో విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. సమావేశంలో నాయకులు మధు, ఆసిఫ్, లక్ష్మణ్, ప్రవీణ్, ప్రవళిక, అనూష తదితరులు పాల్గొన్నారు.జూనియర్ కళాశాల విద్యార్థులతో మాట్లాడుతున్న జిల్లా కార్యదర్శి బలముల ప్రేమ్ కుమార్.

Related Articles

spot_img

Most Popular