బోర్ఖడే హేమంత్ సహదేవరావు
నూతన సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన నిర్మాణానికి సంబంధించిన తుది దశ పనులను వేగవంతంగా పూర్తి చేసి, నాణ్యతలో ఎలాంటి రాజీ పడకుండా అన్ని సౌకర్యాలతో అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా భవనంలోని వివిధ విభాగాలు, కార్యాలయ గదులు, సమావేశ మందిరాలు, విద్యుత్, తాగునీరు, పారిశుధ్యం, అంతర్గత రహదారులు, పార్కింగ్, పచ్చదనం, డ్రైనేజీ తదితర మౌలిక సదుపాయాల ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

