రామగుండం : పోలీస్ కమిషనరేట్ సీపీ కార్యాలయంలోని పరిపాలనా విభాగాలను పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా కార్యాలయంలో నిర్వహిస్తున్న పరిపాలనా రికార్డులు, సేవా నమోదులు (సర్వీస్ రిజిస్టర్లు), దస్త్రాల నిర్వహణ, పెండింగ్ అంశాలు, కార్యాలయ నిర్వహణ తీరును క్షుణ్ణంగా పరిశీలించారు.
అనంతరం బి-సెక్షన్ సూపరింటెండెంట్‌తో మాట్లాడుతూ, అధికారులు, సిబ్బందికి సంబంధించిన జీతాలు,ప్రయాణ భత్యాలు (టీఏ), ఇతర అన్ని రకాల భత్యాలు,బడ్జెట్ బిల్లులను సకాలంలో సమర్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించి సక్రమంగా నిర్వహించాలని, పెండింగ్‌లో ఉన్న దస్త్రాలను త్వరితగతిన పరిష్కరించాలని, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా కార్యాలయ పరిపాలన సాగేందుకు సంబంధిత అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పోలీస్ కమిషనర్ ఆదేశించారు.

