Thursday, July 16, 2026

Buy now

గురుకులాలు, హాస్టళ్లలో క్లీన్ అండ్ గ్రీన్‌కు అత్యంత ప్రాధాన్యం:బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం

ప్రభుత్వం నిర్ణయించిన మెనూను ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ లేకుండా అమలు చేయాలి.
బీసీ స్టడీ సర్కిల్స్ బలోపేతానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తాం.జూలై 16 నుంచి జరిగే కులవృత్తుల మేళాలో అన్ని కులాల సంప్రదాయ వృత్తిదారులకు సమాన అవకాశాలు కల్పిస్తాం.స్కిల్ డెవలప్మెంట్, ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్ ద్వారా బీసీలకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించడమే మా లక్ష్యం బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశం .

బీసీ సంక్షేమ శాఖలో సంక్షేమం, నాణ్యత, ఉపాధి కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం.
గురుకులాలు, హాస్టళ్లు ప్రారంభమై 20 రోజులు పూర్తైన నేపథ్యంలో గత సమీక్షా సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలును ఉన్నతాధికారులతో సమీక్షించడం జరిగింది

గురుకులాలు, హాస్టళ్లు పరిశుభ్రంగా, పచ్చదనంతో కూడిన క్లీన్ అండ్ గ్రీన్ వాతావరణంలో ఉండేలా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించి . ప్రభుత్వం నిర్ణయించిన మెనూను అన్ని గురుకులాలు, హాస్టళ్లలో తప్పనిసరిగా అమలు చేయాలని స్పష్టం చేయడం జరిగింది .

జిల్లా బీసీ సంక్షేమ అధికారులు క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ విద్యార్థుల సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని సూచించి,ప్రజాప్రతినిధులు తరచూ గురుకులాలు, హాస్టళ్లను సందర్శించి విద్యార్థుల పరిస్థితులను స్వయంగా పరిశీలించాలని కోరడం జరిగింది .

బీసీ స్టడీ సర్కిల్స్‌ను మరింత బలోపేతం చేసేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించడం జరిగింది . సివిల్స్‌తో పాటు వృత్తి శిక్షణ, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని, ఢిల్లీ, అహ్మదాబాద్ వంటి ప్రాంతాల్లో విజయవంతంగా అమలవుతున్న విధానాలను అధ్యయనం చేసి తెలంగాణలో అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించడం జరిగింది

జూలై 16 నుంచి హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌లో నిర్వహించే కులవృత్తుల మేళాలో అన్ని కులాల సంప్రదాయ వృత్తిదారులకు సమాన అవకాశాలు కల్పించాలని ఆదేశించాను. మహిళల ఆర్థిక స్వావలంబనకు తోడ్పడే కుట్టు మిషన్ పథకం అమలుకు సమగ్ర విధివిధానాలు రూపొందించాలని సూచించడం జరిగింది

బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపట్టి యువతకు ఉపాధి అవకాశాలు పెంచాలని, ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్‌పై సమగ్ర అధ్యయనం చేసి అమలుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించడం జరిగింది

ఐఐటీలు, ఐఐఎంలలో సీట్లు సాధించిన గురుకుల విద్యార్థులకు అందించే ల్యాప్‌టాప్‌ల పంపిణీపై సమగ్ర నివేదిక సమర్పించాలని సూచించాను. బీసీ సంక్షేమ శాఖ కమిషనర్, గురుకులాల కార్యదర్శి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ విద్యార్థులకు నాణ్యమైన సౌకర్యాలు అందుతున్నాయో లేదో నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించాను. కాటమయ్య రక్షణ కవచాల శిక్షణ పూర్తి చేసుకుని కిట్లు అందని జిల్లాల్లో వెంటనే పంపిణీ పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేయడం జరిగింది .

బీసీ సంక్షేమ శాఖలో సంక్షేమం, నాణ్యమైన విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. విద్యార్థులు, యువత, సంప్రదాయ వృత్తిదారుల అభ్యున్నతే మా ప్రభుత్వ లక్ష్యం.

Related Articles

spot_img

Most Popular