Thursday, July 16, 2026

Buy now

ప్రభుత్వం ఇచ్చిన గన్‌మెన్‌లను మరోసారి వెనక్కి తిరిగి పంపిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

హైదరాబాద్‌: ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ప్రభుత్వం కేటాయించిన గన్‌మెన్‌లను మరోసారి తిరిగి పంపించారు. ప్రజాప్రతినిధిగా తనకు ప్రజల ప్రేమాభిమానాలు, విశ్వాసమే నిజమైన భద్రత అని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ప్రజల మధ్యే ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం తన బాధ్యత అని, అదనపు భద్రత అవసరం లేదనే తన అభిప్రాయాన్ని మరోసారి వ్యక్తం చేశారు. ప్రజలతో నిత్యం మమేకమై, అందుబాటులో ఉంటూ సేవ చేయడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు.

ఈ నిర్ణయం ద్వారా ప్రజలతో తన అనుబంధాన్ని, నిరాడంబరమైన ప్రజాసేవ పట్ల తన నిబద్ధతను మరోసారి చాటుకున్నారని పార్టీ నాయకులు, కార్యకర్తలు పేర్కొన్నారు.

Related Articles

spot_img

Most Popular