Thursday, July 16, 2026

Buy now

దేవాలయాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్‌జిల్లా దొంగ అరెస్ట్.

రామగుండం: పోలీస్ కమిషనరేట్, మంచిర్యాల జోన్ పరిధిలోని మంచిర్యాల పట్టణంలో ఇటీవల జరిగిన దేవాలయ చోరీ కేసును పోలీసులు అత్యంత వేగంగా ఛేదించి, వరుసగా దేవాలయాలు,ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న అంతర్‌జిల్లా నేరస్థుడిని అరెస్ట్ చేశారు.నిందితుడు రౌతు పవన్,తండ్రి: నగేష్, వయస్సు: 26 సం.లు, వృత్తి: కూలి,నివాసం: దుబ్బగూడెం గ్రామం, మహాదేవపూర్ మండలం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా.

స్వాధీనం చేసుకున్న వస్తువులు :
* 900 గ్రాముల వెండి వస్తువులు
* రూ.65,000 నగదు
* ఒక వివో (VIVO) మొబైల్ ఫోన్.

ఎండోమెంట్స్ శాఖ జూనియర్ అసిస్టెంట్ ఠాకూర్ ప్రతాప్ సింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు,జూలై 5న మంచిర్యాల పట్టణంలోని శ్రీ విశ్వనాథ ఆలయంలో గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించి కార్యాలయ గది తాళాలు,బీరువాను పగులగొట్టి రూ.65,000 నగదు, 900 గ్రాముల వెండి వస్తువులు,ఒక మొబైల్ ఫోన్‌ను అపహరించినట్లు ఫిర్యాదు చేశారు.

ఆ ఫిర్యాదు ఆధారంగా మంచిర్యాల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి,పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు మంచిర్యాల డీసీపీ పర్యవేక్షణలో ఏసీపీ,ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాలు, నిఘా సమాచారంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా,శ్రీ విశ్వనాథ ఆలయంలో చోరీ చేసినట్లు అంగీకరించాడు.

అలాగే జూలై 2న మంచిర్యాల బైపాస్ రోడ్డులోని శివాలయంలో కూడా చోరీ చేసినట్లు ఒప్పుకున్నాడు. విచారణలో తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో దేవాలయాలు,ఇళ్లలో జరిగిన పలు చోరీ కేసుల్లో తన ప్రమేయం ఉన్నట్లు అంగీకరించాడు.

దర్యాప్తులో నిందితుడిపై కరీంనగర్ 1 టౌన్, కరీంనగర్ 2 టౌన్, మంచిర్యాల, హనుమకొండ, ఇంతజార్‌గంజ్, అక్కన్నపేట, హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 20 చోరీ కేసులు నమోదైనట్లు వెల్లడైంది.వీటిలో పాత భారతీయ శిక్షాస్మృతి (IPC) కింద నమోదైన కేసులతో పాటు,భారతీయ న్యాయ సంహిత (BNS) కింద నమోదైన తాజా కేసులు కూడా ఉన్నాయి.దేవాలయ చోరీ కేసును అత్యంత వేగంగా ఛేదించి, నిందితుడిని అరెస్ట్ చేసి,దొంగిలించిన ఆస్తిని స్వాధీనం చేసుకున్న మంచిర్యాల ఇన్‌స్పెక్టర్ ఎస్. ప్రమోద్ రావు,ఎస్‌ఐ మధుసూదన్,క్రైమ్ సిబ్బంది ఉపేందర్, మహేష్,లక్ష్మణ్, తిరుపతిలను మంచిర్యాల ఏసీపీ అభినందించారు.

Related Articles

spot_img

Most Popular