హైదరాబాద్ నగరంలో జరుగుతున్న ది గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్–2026 సందర్భంగా, భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో అంతర్జాతీయ వ్యాపార, ప్రభుత్వ ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసింది.ఈ ప్రతినిధుల బృందానికి మెరిడియన్ కలెక్టివ్ ప్రతినిధులు రిత్విక భట్టాచార్య, ఉమా భట్టాచార్య నాయకత్వం వహించారు.ఈ సందర్భంగా తెలంగాణలో పర్యావరణ పరిరక్షణ, హరిత అభివృద్ధి, గ్రిడ్ మౌలిక సదుపాయాల విస్తరణ, సాంకేతిక రంగంలో పెట్టుబడులు మరియు పరస్పర సహకార అవకాశాలపై కీలక చర్చలు జరిగాయి.

