Thursday, July 16, 2026

Buy now

ముఖ్యమంత్రి ని కలిసిన యాదగిరిగుట్ట నూతన పాలక మండలి సభ్యులు

యాదగిరిగుట్ట: శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నూతన పాలక మండలి సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో జరిగిన ఈ సమావేశంలో దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ పాల్గొన్నారు.

ఇటీవల నూతనంగా ఏర్పాటైన ఈ బోర్డు సభ్యులు ముఖ్యమంత్రి ని కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సమావేశంలో యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు చైర్మన్ సత్యనారాయణ రెడ్డి , బోర్డు సభ్యులైన ఎమ్మెల్యే వినోద్ వెంకటస్వామి ,సురేఖ ,విజయ రాజం,పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్ , డాక్టర్ మల్లయ్య, స్వాతి కాంతమనేని , రాఘవేందర్ రావు , డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా యాదగిరిగుట్ట క్షేత్ర అభివృద్ధి, భక్తుల సౌకర్యాల కల్పనపై నూతన పాలక మండలికి ముఖ్యమంత్రి పలు కీలక సూచనలు చేస్తూ దిశానిర్దేశం చేశారు.

Related Articles

spot_img

Most Popular