Thursday, July 16, 2026

Buy now

ఏఎస్ఐగా యాదగిరికి పదోన్నతి

* ఏఎస్ఐగా సన్మానిస్తున్న మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ డి.జానకి

ఉమ్మడి ​మహబూబ్‌నగర్ బ్యూరో: స్పెషల్ బ్రాంచ్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న జి.యాదగిరి ఏఎస్ఐగా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకిని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఎస్పీ ఆయనకు పదోన్నతి సూచికను బహుకరించి, అభినందనలు తెలిపారు. ​1990 బ్యాచ్‌కు చెందిన యాదగిరి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో సుదీర్ఘకాలం సేవలందించారు. ప్రస్తుతం ఆయన ఏఎస్ఐగా పదోన్నతిపై జోగులాంబ గద్వాల జిల్లాకు బదిలీ అయ్యారు. విధుల్లో ఇదే నిబద్ధతను కొనసాగించాలని ఈ సందర్భంగా ఎస్పీ ఆకాంక్షించారు.

Related Articles

spot_img

Most Popular