Thursday, July 16, 2026

Buy now

బొమ్మరాస్‌పేట జూనియర్ కళాశాల నిర్మాణ పనులను పరిశీలించిన సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్. శ్రీధర్

ప్రజానావ బ్యూరో:రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్. శ్రీధర్ కడ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా బొమ్మరాస్‌పేటలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల భవన పనులను జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ తో కలిసి సందర్శించి పురోగతిని సమీక్షించారు.

పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయడంతో పాటు నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడవద్దని సంబంధిత అధికారులకు సూచించారు. నిర్మాణ పనులను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.

కళాశాల ప్రారంభోత్సవానికి ముందే అన్ని మౌలిక వసతులు, రహదారి నిర్మాణ పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత ఇంజనీర్లను ఆదేశించారు.ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్. శ్రీధర్‌కు జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వెంకటాచారి, అసిస్టెంట్ కలెక్టర్ (ట్రైనీ) సచిన్ బస్వరాజ్ గుట్టూరు, కడ ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి, జడ్పీ సీఈఓ సుధీర్ పూల బొకేలతో స్వాగతం పలికారు.

పర్యటనలో అదనపు కలెక్టర్ వెంకటాచారి, అసిస్టెంట్ కలెక్టర్ (ట్రైనీ) సచిన్ బస్వరాజ్ గుట్టూరు, కడ ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి, జడ్పీ సీఈఓ సుధీర్, ఇంజనీరింగ్ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular