Thursday, July 16, 2026

Buy now

నంబర్‌ ప్లేట్‌ లేకుంటే సీజే

* మహబూబ్‌నగర్‌లో ట్రాఫిక్‌ పోలీసుల ప్రత్యేక తనిఖీలు
ఉమ్మడి ​మహబూబ్‌నగర్‌ బ్యూరో: జిల్లా ఎస్పీ డి.జానకి ఆదేశాల మేరకు శుక్రవారం పట్టణంలో ట్రాఫిక్‌ సీఐ కె.రాజేందర్‌ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక వాహన తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా నంబర్‌ ప్లేట్లు లేకుండా, అస్పష్టంగా ఉన్న ద్విచక్ర వాహనాలను గుర్తించి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. వాహనదారులకు కౌన్సిలింగ్‌ ఇచ్చి, మోటారు వాహనాల చట్టం ప్రకారం జరిమానాలు విధించడంతో పాటు అక్కడికక్కడే సరైన నంబర్‌ ప్లేట్లను ఏర్పాటు చేయించారు. ​ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. చలానాల నుంచి తప్పించుకోవడానికి, చైన్‌ స్నాచింగ్‌లు వంటి నేరాలకు పాల్పడేందుకే కొందరు నంబర్‌ ప్లేట్లను తొలగిస్తున్నారని మండిపడ్డారు. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా స్పష్టమైన నంబర్‌ ప్లేట్‌ కలిగి ఉండాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Related Articles

spot_img

Most Popular