Thursday, July 16, 2026

Buy now

పాఠశాల అభివృద్ధికి రూ.5 లక్షల విరాళం ​సి.ఎ మహేశ్వర్ రెడ్డి ఉదారత.

ఉమ్మడి మహబూబ్‌నగర్ బ్యూరో ​: సమాజ మార్పునకు, విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు చదువే పునాది అని, అన్ని దానాల్లోకెల్లా విద్యాదానం మిన్న అని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థి, ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ సి.ఎ సంగాల మహేశ్వర్ రెడ్డి పాఠశాల అభివృద్ధి కోసం రూ.5 లక్షల విరాళం ప్రకటించారు.

ఈ మేరకు శనివారం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా ఈ విరాళం చెక్కును పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి అందజేశారు. ​ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చదువుకున్న పాఠశాలను గుర్తుంచుకుని విరాళం అందించిన మహేశ్వర్ రెడ్డిని అభినందించారు.

అలాగే పాఠశాలలో అదనపు బాత్రూముల నిర్మాణానికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అంతకుముందు పాఠశాల ప్రిన్సిపాల్, వార్డు కౌన్సిలర్ ఎమ్మెల్యేకు పుష్పగుచ్ఛాలతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular