* మండల అధ్యక్షుడు పందెం సుఖేందర్ రెడ్డి
ఉమ్మడి మహబూబ్‌నగర్ బ్యూరో: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చొరవ చూపాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పందెం సుఖేందర్ రెడ్డి పిలుపునిచ్చారు.
శనివారం ఆయన కార్యకర్తలతో మాట్లాడుతూ.. ఈ నెల 24 లోగా ఓటర్ల వివరాల నమోదు ప్రక్రియ ముగియనున్నందున, గ్రామాల్లోని కార్యకర్తలు ఇళ్లను సందర్శించి అర్హులైన యువతీ యువకులకు ఓటు నమోదు చేయించాలని కోరారు. ఏ ఒక్క అర్హుడైన ఓటరు కూడా జాబితా నుండి దూరం కాకుండా చూడాలని,అనర్హుల ఓట్లను గుర్తించి, ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓట్లు ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి.
రెండు చోట్ల ఓటు ఉంటే జైలు శిక్ష, జరిమానా పడే అవకాశం ఉన్నందున ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం ఓటర్ల జాబితాలో పేరు, వయస్సు, చిరునామా తప్పులు ఉన్నవారి చేత మార్పుల కోసం దరఖాస్తు చేయించాలని, ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం అత్యంత పారదర్శకంగా ఓటర్ల జాబితా రూపొందేలా కాంగ్రెస్ శ్రేణులు క్షేత్రస్థాయిలో చురుగ్గా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

