Wednesday, July 15, 2026

Buy now

కేటీఆర్‌ను కలిసిన రేవల్లి సోషల్ మీడియా నాయకులు నరసింహ

ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)ను రేవల్లి మండల సోషల్ మీడియా నాయకుడు చిట్టి రాజుల నరసింహ శనివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతం, సోషల్ మీడియా ద్వారా పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే అంశాలపై చర్చించారు. ​యువతకు కేటీఆర్ నాయకత్వం ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని నరసింహ పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి, పార్టీ అభివృద్ధికి కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని కేటీఆర్ ఆకాంక్షించారు. ఈ భేటీపై రేవల్లి మండల పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.

Related Articles

spot_img

Most Popular