Wednesday, July 15, 2026

Buy now

రియల్ ఎస్టేట్‌ను పాతాళానికి తొక్కుతున్నారు

* ​జీవో నెం. 5509/2025తో రియాల్టర్ల పొట్టగొట్టొద్దు
* ​ప్రభుత్వ నిర్ణయాలపై జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ ధ్వజం

ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో: మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు.. క్రమేణా పుంజుకుంటున్న రియల్ ఎస్టేట్ రంగాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తన తుగ్లక్ నిర్ణయాలతో పాతాళానికి తొక్కుతోందని జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ తీవ్రస్థాయిలో విమర్శించారు. గతంలో ఎల్.ఆర్.ఎస్ ఫీజులు చెల్లించి పాత వెంచర్ ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు ఉండటంతో రియాల్టర్లు, మధ్యవర్తులు కాస్తో కూస్తో వ్యాపారం చేసుకుంటూ జీవించేవారని ఆయన గుర్తుచేశారు. ​కానీ, రేవంత్ సర్కార్ అకస్మాత్తుగా జీవో నెం. 5509/2025ను తెరపైకి తెచ్చి పాత వెంచర్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లపై నిషేధం విధించడం దారుణమన్నారు. నేను కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారినే అని చెప్పుకునే ముఖ్యమంత్రి.. అధికారంలోకి వచ్చాక ఈ రంగాన్ని రికార్డు స్థాయిలో అభివృద్ధి చేయాల్సింది పోయి, సర్వనాశనం చేశారు. అప్పులు చెల్లించలేక రియాల్టర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తెచ్చారు. ​ఒకప్పుడు ఎకరం కోటి రూపాయలు పలికిన భూముల ధరలు నేడు దారుణంగా పడిపోయాయని, లక్షలకు కూడా కొనే నాథుడు లేడని అశోక్ ఆవేదన వ్యక్తం చేశారు. భూములు అమ్ముడుపోక, మార్కెట్లో రూపాయి అప్పు పుట్టక సామాన్య ప్రజలు తమ పిల్లల పెళ్లిళ్లు, ఉన్నత చదువులు, ఇళ్ల నిర్మాణాలను వాయిదా వేసుకుంటూ తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని పేర్కొన్నారు. ​తక్షణమే సదరు జీవోను ఉపసంహరించుకుని, రియల్ ఎస్టేట్ రంగాన్ని కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాయకులు గంధం పరంజ్యోతి, జోహెబ్ హుస్సేన్, చిట్యాల రాము తదితరులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular