Wednesday, July 15, 2026

Buy now

బాధిత కుటుంబానికి నిరంజన్‌రెడ్డి పరామర్శ

ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో: నాగపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కార్వంగ పాపులు తండ్రి ముత్యాలు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలిసిన కుటుంబ సభ్యులను ఆదివారం మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పరామర్శించారు. వారిని ఓదార్చి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనంతరం ఓటర్ల జాబితా ప్రత్యేక ముసాయిదా సవరణ ప్రక్రియలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు విధిగా పాల్గొనాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పిలుపునిచ్చారు. రేవల్లి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో కొనసాగుతున్న సవరణ ప్రక్రియను ఆయన ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా బీఎల్‌ఓలు, బీఆర్‌ఎస్ శ్రేణులు దగ్గరుండి ఓటరు నమోదు పత్రాలను తప్పుల్లేకుండా పూరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచుల సంఘం శివరాం రెడ్డి, గౌరీదేవి పల్లి సర్పంచ్ సురేష్ రెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీనివాస్, ఉపసర్పంచ్ వెంకటేష్, నెంబర్ ఖాజా, నరహరి, ప్రతాప్ రెడ్డి పార్టీ నాయకులు పాల్గొన్నారు

Related Articles

spot_img

Most Popular