Tuesday, September 22, 2026

Buy now

పెద్దపల్లి జడ్పీ సీఈఓ పై కలెక్టర్‌కు ఫిర్యాదు

* సొంత జిల్లా నుంచే రాకపోకలు సాగిస్తున్న సీఈఓ నరేందర్
* నిబంధనలకు విరుద్ధంగా హెచ్‌ఆర్‌ఏ పొందుతున్నట్లు ఆరోపణలు
* నిధుల రికవరీ, క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్

ప్రజానావ,పెద్దపల్లి బ్యూరో : జిల్లా ప్రజా పరిషత్ (జెడ్పీ) కార్యాలయ సీఈఓ కె. నరేందర్ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా హెడ్‌క్వార్టర్స్‌లో నివసించడం లేదని ఆరోపిస్తూ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుదారు సముద్రాల రమేష్ తెలిపిన వివరాల ప్రకారం, సీఈఓ కె. నరేందర్ జూలై 2023లో పెద్దపల్లి జిల్లాకు బదిలీపై వచ్చారని, అప్పటి నుంచి జిల్లా ప్రధాన కార్యాలయ పరిధిలో నివసించకుండా మంచిర్యాల జిల్లాలోని తన స్వగృహం నుంచి ప్రతిరోజూ రాకపోకలు సాగిస్తూ విధులు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ ప్రధాన కార్యాలయం (హెడ్‌క్వార్టర్స్) పరిధిలోనే నివసిస్తూ విధులు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్/తెలంగాణ సివిల్ సర్వీసెస్ రూల్స్ లోని సంబంధిత నిబంధనలు, అలాగే జీవో నెంబర్ 20, ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ డిపార్ట్మెంట్, 2001 ఫిబ్రవరి 8 లో పేర్కొన్న నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. హెడ్‌క్వార్టర్స్‌లో నివసించని ఉద్యోగికి ఇంటి అద్దె భత్యం పొందే అర్హత ఉండదని పేర్కొంటూ, గత మూడు సంవత్సరాలుగా పొందిన హెచ్‌ఆర్‌ఏ మొత్తాన్ని రికవరీ చేయాలని, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఫిర్యాదుదారు కోరారు.

Related Articles

spot_img

Most Popular