Wednesday, July 15, 2026

Buy now

పెద్దపల్లి జంక్షన్ మీదుగా నాందేడ్ – తిరుచానూరు ఎక్స్ ప్రెస్ రైలు.

పెద్దపల్లి : పెద్దపల్లి జంక్షన్ మీదుగా జూలై 21 నుండి ఆగష్టు 25 వరకు 07603 నాందేడ్ నుండి తిరుచానూరు వీక్లీ ప్రత్యేక ఎక్స్ ప్రెస్ రైలు వారానికి ఒక రోజు చొప్పున ఆరు ట్రిప్ లు దిగువ మార్గంలో వయా వరంగల్ – విజయవాడ – గూడూరు మీదుగా నడుస్తుంది అదే విధంగా ఎగువ మార్గంలో 07604 తిరుచానూరు నుండి నాందేడ్ వీక్లీ ప్రత్యేక ఎక్స్ ప్రెస్ రైలు జూలై 22 నుండి ఆగష్టు 26వ తేదీ వరకు వారానికి ఒక రోజు చొప్పున 6 ట్రిప్లు నడుస్తుంది, మొత్తంగా ఎగువ , దిగువ మార్గాల్లో నాందేడ్ నుండి తిరుచానూరు నుండి నాందేడ్ వీక్లీ ప్రత్యేక ఎక్స్ ప్రెస్ రైళ్లు 12 ట్రిప్ లు నడుస్తాయి. ఇప్పటికే పెద్దపల్లి జంక్షన్ నుండి వయా వరంగల్ – విజయవాడ – గూడూరు మార్గంలో వారానికి 2 రోజులు 12762 కరీంనగర్ నుండి తిరుపతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ ప్రతి ఆది, గురువారాల్లో నడుస్తుంది, 17635 నాందేడ్ నుండి ధర్మవరం వీక్లీ ఎక్స్ ప్రెస్ ప్రతి శుక్రవారం 17633 నాందేడ్ నుండి తిరుచానూరు వీక్లీ ఎక్స్ ప్రెస్ ప్రతి శనివారాల్లో నడుస్తున్నాయి, అదే విధంగా గురువారం రోజున 07814 జాల్నా నుండి తిరుపతి వీక్లీ ప్రత్యేక ఎక్స్ ప్రెస్ రైలు నడుస్తుంది, తాజాగా మంగళవారం రోజున 07603 నాందేడ్ నుండి తిరుచానూరు వీక్లీ ప్రత్యేక ఎక్స్ ప్రెస్ రైలు అందుబాటులోకి రావడంతో ఇక ప్రతి ఆది, మంగళ, గురు, శుక్ర, శనివారాల్లో ఇదే మార్గం గుండా వారానికి 5 రోజులు తిరుపతి కి రైలు సౌకర్యం అందుబాటులోకి వచ్చింది, కేవలం సోమ, బుధ వారాల్లో మాత్రమే ఈ మార్గంలో తిరుపతి కి రైలు లేదు. నాందేడ్ నుండి తిరుచానూరు వీక్లీ ప్రత్యేక ఎక్స్ ప్రెస్ రైలు పెద్దపల్లి జంక్షన్ కి ప్రతి మంగళవారం రాత్రి 9 గంటలకు వచ్చి 9:30 నిమిషాలకు బయలుదేరుతుంది, అదే విధంగా 07604 తిరుచానూరు నుండి నాందేడ్ వీక్లీ ప్రత్యేక ఎక్స్ ప్రెస్ రైలు ప్రతి గురువారం రాత్రి (తెల్లవారు జామున) 01:50 నిమిషాలకు వచ్చి 02:15 నిమిషాలకు బయలుదేరుతుంది. ఈ రైలు సేవలను ప్రయాణికులు వినియోగించుకోగలరు. ఇప్పటికే ఇదే మార్గం గుండా నడిచే 07814/13 జాల్నా నుండి తిరుపతి నుండి జాల్నా వీక్లీ ప్రత్యేక ఎక్స్ ప్రెస్ రైలు మంచి ఆదరణతో నడుస్తుంది, గతంలో ప్రత్యేక వీక్లీ ఎక్స్ ప్రెస్ రైళ్లుగా మంచి ఆదరణతో నడిచిన తిరుచానూరు, ధర్మవరం రైళ్ళను క్రమబద్ధీకరించారు

Related Articles

spot_img

Most Popular