*23 అసెంబ్లీ స్థానాలకు ఇన్ చార్జీలను ప్రకటిస్తే సగానికి పైగా సీట్లు బీసీ నేతలకే*
*తన లక్కీ నంబర్ 5 అంకె వచ్చేలా 23 స్థానాలకు ఇన్ చార్జీలను ప్రకటించిన కల్వకుంట్ల కవిత*
*ఆషాఢ మాసంలో మంచి ముహూర్తంలో ఇన్ చార్జీల ప్రకటన*
విద్య, ఉద్యోగాలతో పాటు రాజకీయాల్లోనూ బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఉద్యమిస్తున్న తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు కల్వకుంట్ల కవిత తన పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జీల ప్రకటనలో బీసీలకు పెద్దపీట వేశారు
23 అసెంబ్లీ స్థానాలకు ఇన్ చార్జీలను ప్రకటిస్తే అందులో 12 మంది బీసీ నేతలకు స్థానం కల్పించారు.. ఐదుగురు ఎస్సీలు, ఎస్టీ నేత ఒకరికి అవకాశం కల్పించారు. 5 చోట్ల ఓసీ నేతలను ఇన్ చార్జీలుగా నియమించారు
కల్వకుంట్ల కవిత లక్కీ నంబర్ అయిన 5 అంకె వచ్చేలా 23 స్థానాలకు ఇన్ చార్జీలను ప్రకటించారు
ఆషాఢ మాసంలో మంచి ముహూర్తం చూసుకొని అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ చార్జీల పేర్లు ప్రకటించారు. మిగతా అసెంబ్లీ నియోజకవర్గాలకు త్వరలోనే ఇన్ చార్జీలను ప్రకటిస్తారు
అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ చార్జీల నియామకం వెంటనే అమల్లోకి వస్తుందని ప్రకటించారు.. ఇన్ చార్జీలుగా నియామకం అయిన నాయకులు పార్టీ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ వారి సమస్యలపై పోరాడాలని సూచించారు. పార్టీ పాంచజన్య సిద్ధాంతాన్ని ప్రతి గడపకు చేరవేసి తెలంగాణ రక్షణ సేన పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.

