Wednesday, July 15, 2026

Buy now

పెదగూడెంలో ‘సర్’ ప్రక్రియను పరిశీలించిన డీసీసీ చీఫ్

​ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో: వనపర్తి మండలం పెదగూడెం గ్రామంలో కొనసాగుతున్న సర్ ప్రక్రియ డెస్క్‌ను బుధవారం వనపర్తి డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఎల్ఏ-2లు, ఇన్‌చార్జీలు నిరంతరం ఓటర్లకు అందుబాటులో ఉంటూ ఓటు నమోదు అప్‌లోడ్‌ ప్రక్రియలో సహకరించాలని ఆదేశించారు. అందుబాటులో ఉన్న బీఎల్ఓలతో సమన్వయం చేసుకుంటూ.. నిర్దేశిత గడువులోగా నాణ్యతతో ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. ప్రతి బీఎల్ఏ-2 కనీసం 100 ఎన్యూమరేషన్ ఫారాలను డిజిటలైజ్ చేయించాలని సూచించారు. ​ఈ కార్యక్రమంలో సర్పంచ్ పుష్పలత శివకుమార్, మాజీ సర్పంచ్ కొండయ్య, నాగన్న, భాస్కర్ రెడ్డి, రమేష్, శివకుమార్, బుచ్చిబాబు, సురేష్, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ శారదమ్మ, విష్ణువర్ధన్ రెడ్డి, మల్లేష్, గుండాల రాములు, బాలు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular