Wednesday, July 15, 2026

Buy now

17న ‘దళిత అస్తిత్వ రాజకీయాలు’ పుస్తక చర్చ

​ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో: కారంచేడు దళిత మృతవీరుల సంస్మరణార్థం ఈ నెల 17న హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రత్యేక పుస్తక చర్చా కార్యక్రమం జరగనుంది. ‘కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి’ ఆధ్వర్యంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ చర్చ నిర్వహిస్తున్నారు. ప్రొఫెసర్ కె. శ్రీనివాసులు రచించిన ‘దక్షిణ భారతదేశంలో కుల ఆధిపత్యం మరియు ప్రతిఘటన దళిత అస్తిత్వ రాజకీయాలు’ పుస్తకంపై పలువురు యూనివర్సిటీ ప్రొఫెసర్లు, మేధావులు ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ బుధవారం వనపర్తిలో ఈరపాగ గోవిందు, సైదామ్మ, తదితరులు కరపత్రాలు ఆవిష్కరించారు.

Related Articles

spot_img

Most Popular