హైదరాబాద్: నీట్ ప్రశ్నపత్రం లీకేజీ ఘటనతో లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని ప్రభుత్వ విప్ డాక్టర్ బల్మూర్ వెంకట్ అన్నారు.
విద్యా వ్యవస్థలో చోటుచేసుకున్న వైఫల్యాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పారదర్శకమైన పరీక్షల నిర్వహణ విధానాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘ఛత్రోంకి గూంజ్’ కార్యక్రమంలో విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున పాల్గొని విద్యా వ్యవస్థలో మార్పు కోసం గొంతు కలపాలని డాక్టర్ బల్మూర్ వెంకట్ పిలుపునిచ్చారు.

