Saturday, August 15, 2026

Buy now

బాధిత హోంగార్డుల కుటుంబాలకు ఆర్థిక సాయం

​ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో: అనారోగ్యంతో మృతి చెందిన ఇద్దరు హోంగార్డుల కుటుంబాలకు జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి. పాటిల్ సోమవారం 20న ఆర్థిక సాయం అందజేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో.. ఊర్కొండ పీఎస్‌లో పనిచేస్తూ మరణించిన హోంగార్డ్ బాలయ్య కుటుంబానికి రూ. లక్ష, కోడేరు పీఎస్‌లో పనిచేస్తూ చనిపోయిన బయన్న కుటుంబానికి రూ. 94 వేల చొప్పున సాయాన్ని అందజేశారు. జిల్లా సాయుధ సిబ్బంది, హోంగార్డులు కలిసి ఈ మొత్తాన్ని రూ. 1,94వేలు జమ చేశారు. వీటికి అదనంగా జిల్లా పోలీస్ వెల్ఫేర్ నుంచి మరో రూ. 20 వేల ఆర్థిక సాయాన్ని ఎస్పీ చేతులమీదుగా బాధిత కుటుంబాలకు అందించారు. ​ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తప్పకుండా హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ పాలసీలు తీసుకోవాలని, ఇవి విపత్కర పరిస్థితుల్లో కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలుస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్‌ఐ రాఘవరావు, ఆర్‌ఎస్‌ఐలు ప్రశాంత్, శివాజీ, గౌస్ పాషా, హోంగార్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు జమ్ములు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular