Saturday, August 15, 2026

Buy now

బాలికల విద్యతోనే ఉన్నత భవిష్యత్తు: కలెక్టర్ ఆదర్శ్ సురభి

ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో: బాలికల విద్యాభివృద్ధి, ఉన్నత విద్యలో ప్రోత్సాహమే లక్ష్యంగా మంగళవారం పట్టణంలోని దాచా లక్ష్మయ్య ఫంక్షన్ హాల్లో విలేజెస్ ఇన్ పార్ట్‌నర్‌షిప్ సంస్థ ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాల కార్యక్రమం వైభవంగా జరిగింది. విఐపి వ్యవస్థాపకులు నాగేంద్ర స్వామి నేతృత్వంలో జరిగిన ఈ వేడుకకు వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ​ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. స్వచ్ఛంద సంస్థలు బాలికల విద్య కోసం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. విద్యార్థినులు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ, కష్టపడి చదివి లక్ష్యాలను సాధించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు.

Related Articles

spot_img

Most Popular