ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా ధర్నా చేస్తున్న విద్యార్థులు, ప్రజాస్వామ్యవాదులపై పోలీసులు జరిపిన దాడి అత్యంత అమానుషమని తెలంగాణ జనసమితి వనపర్తి జిల్లా అధ్యక్షుడు ఎం.ఏ. ఖాదర్ బాషా మండిపడ్డారు. నీట్ పేపర్ లీకేజీ, స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై ప్రశ్నిస్తే లాఠీలు, రబ్బర్ బుల్లెట్లతో దాడి చేయడం దారుణమన్నారు. ఈ అరాచకానికి పాల్పడిన పోలీసు అధికారులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని, నీట్ అక్రమాలపై విచారణ జరిపి విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యయుతంగా పోరాడే వారి హక్కులను కాలరాస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

