Saturday, August 15, 2026

Buy now

తెలుగు సబ్జెక్ట్ ఫోరం ఏర్పాటు చేస్తాం

​– పండిత సంఘం జిల్లా అధ్యక్షుడు బూరోజు గిరిరాజాచారి
ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో: వనపర్తి జిల్లాలో తెలుగు భాషాభివృద్ధికి, విద్యార్థుల్లో భాషా నైపుణ్యాలను పెంపొందించడానికి త్వరలోనే తెలుగు సబ్జెక్ట్ ఫోరం ఏర్పాటు చేస్తామని పండిత సంఘం జిల్లా అధ్యక్షుడు, తెలుగు భాషా పండితుడు బూరోజు గిరిరాజాచారి తెలిపారు. స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న రెండవ విడత తెలుగు భాషా పండితుల వృత్త్యంతర శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఇతర సబ్జెక్టుల మాదిరిగానే తెలుగు భాషకు కూడా ఫోరం అవసరమని, పది రోజుల్లో దీనిని తప్పకుండా ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు పండితులు కంటె నిరంజనయ్య, జయంత్ రెడ్డి, భైరోజు చంద్రశేఖర్, రాజారెడ్డి, భాను ప్రకాష్, నరసింహస్వామి తదితరులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular