పెద్దపల్లి : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు (కేటీఆర్) మంచిర్యాల నియోజక వర్గంలోని లక్షట్ పేట్ నిర్వహిస్తున్న రైతు సదస్సుకు పెద్దపల్లి నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో వందలాది మంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. ఈ సందర్భంగా దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రజల తరఫున బీఆర్ఎస్ పార్టీ బలంగా వినిపిస్తోందని అన్నారు. రైతు సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిందని గుర్తు చేశారు. ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు రైతు సదస్సులో దిశానిర్దేశం చేయనున్నారని తెలిపారు. వారి వెంట బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

