* రూ.29 లక్షలతో మహిళా పోలీస్ స్టేషన్ వెయిటింగ్ హాల్
* పారిశ్యుద్ధం మెరుగుదలకు నూతన జేసీబి కొనుగోలు
* ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు
పెద్దపల్లి : వ్యవసాయ మార్కెట్లోని మహిళా పోలీస్ స్టేషన్ ఆవరణలో రూ.29 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన వెయిటింగ్ హాల్ ను స్థానిక నాయకులతో కలిసి పోలీస్ అధికారులతో ప్రారంభం చేసి అనంతరం పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్లో రూ.43 లక్షలతో కొనుగోలు చేసిన జేసీబి వాహనాన్ని ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు ప్రారంభించారు. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మహిళా పోలీస్ స్టేషన్లో మున్సిపల్ నుండి 29 లక్షల రూపాయలతో షెడ్ నిర్మాణం చేసుకొని ప్రారంభించి మొక్కలు నాటారు. అలాగే రాబోయే రోజుల్లో పెద్దపల్లి మున్సిపల్లో దశల వారిగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. గతంలో మున్సిపల్ పరిధిలో ఏమైనా కార్యక్రమాలు చేయాలంటే జేసీబీ అద్దెకు తెచ్చుకునే పరిస్థితి ఉండేదని దాన్ని దృష్టిలో ఉంచుకొని బుధవారం మున్సిపల్ కి స్వంతగా రూ.43 లక్షలతో జేసీబీ కొనుగోలు చేసి ప్రారంభించారు. అనంతరం మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లతో అధికారులతో కలిసి మొక్కలు నాటడం జరిగిందని తెలిపారు. అలాగే మహిళా పోలీస్ స్టేషన్ కి పెద్దపల్లి జిల్లాలో 14 మండలలు, 4 మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నుంచి పెద్ద ఎత్తున బాధితుల రావడం జరుగుతుంది కాబ్బటి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సీపీ మరియు పోలీస్ బృందం ఆలోచన మేరకు రూ.29 లక్షలతో షెడ్ నిర్మాణం చేసుకోవడం జరిగిందని తెలిపారు. ప్రజలు అవసరాల నిమిత్తం అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుందని అన్నారు. పెద్దపల్లి పట్టణంలో కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి రాబోయే సంవత్సర కాలంలో పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి, బస్సు డిపో, కోర్టు, బైపాస్ రోడ్డు పనులు జరుగుతున్నాయని అన్నారు. అలాగే పెద్దపల్లి పట్టణంలో రోడ్లు, డ్రైనేజీలు, వాటర్ ట్యాంకుల నిర్మాణం, త్రాగు నీటి సమస్య లేకుండా పైపు లైన్స్ వేయడం జరుగుతుందని ప్రజలందరు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్, పోలీస్ అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

