Thursday, July 30, 2026

Buy now

సౌత్ సెంట్రల్ రైల్వే జీఎంకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య వినతి

పెద్దపల్లి : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య బుధవారం సికింద్రాబాద్‌లోని దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయంలో సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాత్సవను కలిసి నాచారం, మౌళాలి, పెద్దపల్లి ప్రాంతాలకు సంబంధించిన పలు కీలక రైల్వే సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా ఆయా సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని కోరుతూ వినతి పత్రాన్ని సమర్పించారు. వినతులను జాగ్రత్తగా విన్న రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాత్సవ సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్సీ మల్క కొమరయ్య తెలిపారు. ఎమ్మెల్సీ మల్క కొమరయ్య చేసిన ప్రధాన ప్రతిపాదనలు పెద్దపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధి వేగవంతం చేయాలని, అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద పెద్దపల్లి రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులు ఆలస్యమవుతున్నాయని పేర్కొంటూ, వాటిని మరింత వేగంగా పూర్తి చేయాలని ఆయన కోరారు.

Related Articles

spot_img

Most Popular