Thursday, July 30, 2026

Buy now

యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం

* చెన్నూర్‌లో కాంగ్రెస్ నిరసన ర్యాలీ.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్.

మంచిర్యాల జిల్లా / చెన్నూర్, (ప్రజనావ న్యూస్ ప్రతినిధి): ఢిల్లీలో నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమంలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు, ఎంపీలు, ముఖ్యమంత్రులు, కార్యకర్తలపై జరిగిన లాఠీచార్జ్‌ను నిరసిస్తూ చెన్నూర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం ఆందోళన కార్యక్రమం నిర్వహించారు.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రి డా. గడ్డం వివేక్ వెంకటస్వామి, మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ్ రెడ్డి ఆదేశాల మేరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి గాంధీ చౌక్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి, అనంతరం పాత బస్టాండ్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చౌక్ వద్ద నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా చెన్నూర్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జాడి రాజేందర్ మాట్లాడుతూ, **నీట్ పేపర్ లీకేజీకి పూర్తి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని** డిమాండ్ చేశారు. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే విద్యార్థులు, యువత తమ హక్కుల కోసం శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే వారిపై లాఠీలు ప్రయోగించడం బీజేపీ ప్రభుత్వ అహంకారానికి, నియంతృత్వ పాలనకు నిదర్శనమని విమర్శించారు.

ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, కే.సి. వేణుగోపాల్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలపై జరిగిన పోలీసుల చర్యలను తీవ్రంగా ఖండించారు. విద్యార్థులపై పడిన ప్రతి లాఠీ దెబ్బకు, చిందిన ప్రతి రక్తపు బొట్టుకు బీజేపీ ప్రభుత్వం ప్రజాక్షేత్రంలో సమాధానం చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు.

విద్యార్థులు, యువత న్యాయమైన హక్కుల సాధన కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని, కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఢిల్లీలో జరిగిన అరెస్టులు, లాఠీచార్జ్‌ను యూత్ కాంగ్రెస్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎన్ఎస్‌యూఐ నియోజకవర్గ అధ్యక్షుడు జంగపల్లి సంజయ్, మండల వైస్ ప్రెసిడెంట్ లింగంపల్లి మహేష్, మున్సిపల్ చైర్‌పర్సన్ పెద్దింటి పద్మ శ్రీనివాస్, వైస్ చైర్మన్ నాయకపు వినయ్, మార్కెట్ కమిటీ చైర్మన్ మహేష్ ప్రసాద్ తివారి, కౌన్సిలర్లు అంబటి శంకర్, అజీముద్దీన్, సుంకరి శిరీష సంతోష్, సుద్దపల్లి సునీత సుశీల్, నజ్మా అమీర్, కో-ఆప్షన్ సభ్యులు సాధనబోయిన క్రిష్ణ, సయ్యద్ సాహిర్, కాజా బేగం ఖలీల్, మండల అధ్యక్షుడు ముత్యాల బాపాగౌడ్, జిల్లా కార్యదర్శులు చింతల శ్రీనివాస్, కొండ వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, యువజన నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular