◆ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి: కలెక్టరేట్‌ను ముట్టడించిన AISF
◆ నాగర్‌కర్నూల్ కలెక్టరేట్ ముట్టడి..విద్యార్థి సమస్యల పరిష్కారానికి AISF డిమాండ్
◆ విద్యారంగ బడ్జెట్ 20% పెంచాలి.
ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో: స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో గురువారం నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టరేట్‌ను ముట్టడించారు. అనంతరం పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్‌కు సమర్పించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బలముల ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ.. జీవో నెం. 7, 8, 9లను రద్దు చేసి పాత విధానంలోనే ఫెలోషిప్‌లు, స్కాలర్‌షిప్‌లు వర్తింపజేయాలన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతులు కల్పించి, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని కోరారు. బడ్జెట్‌లో విద్యారంగానికి 20 శాతం నిధులు కేటాయించాలని, తక్షణమే రాష్ట్రానికి పూర్తిస్థాయి విద్యాశాఖ మంత్రిని నియమించాలని డిమాండ్ చేశారు. డిమాండ్లు పరిష్కరించకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు ఫన్నీ, అర్జున్, చరణ్, యశ్వంత్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

