Thursday, July 30, 2026

Buy now

విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి: ఏఐఎస్ఎఫ్

* కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించిన ఏఐఎస్ఎఫ్ నాయకులు
* ప్రభుత్వాలను కూల్చాలన్న నిర్మించాలన్న విద్యార్థులతోనే సాధ్యం
* విద్యార్థులను విస్మరించిన ప్రభుత్వాలు మనుగడలో లేవు
* ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రేణుకుంట్ల ప్రీతం, ఆర్నకొండ సాయి ఆజాద్

పెద్దపల్లి : అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా సమితి ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కేజీ టు పీజీ విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని వందల మంది విద్యార్థులతో ముట్టడించడం జరిగిందని
ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా అధ్యక్ష అండ్ కార్యదర్శులు రేణుకుంట్ల ప్రీతం, ఆర్నకొండ సాయి ఆజాద్ అన్నారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బాలసాని లెనిన్, పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం, జిల్లా అధ్యక్షులు ఆర్నకొండ సాయి ఆజాద్ మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న సుమారు రూ.11 వేల కోట్ల స్కాలర్షిప్స్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ ని వెంటనే విడుదల చేసి జిఓ నెంబర్ 7, 8, 9 లను రద్దు చేయాలని,రాష్ట్రంలో 27 వేల ప్రభుత్వ పాఠశాలలను నాలుగు వేలకు కుదించాలనే ఆలోచనను మానుకోవాలని, విద్యాశాఖకు మంత్రిని కేటాయించాలని, ప్రైవేట్, కార్పొరేట్ విద్యా వ్యాపారాన్ని అరికట్టి ఫీజుల నియంత్రణ చట్టం చేయాలని, ఖాళీగా ఉన్న టీచర్, లెక్చరర్, ఎంఈఓ, డిఈఓ పోస్టులను భర్తీ చేయాలని, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్నం భోజన పథకాన్ని తక్షణమే ప్రారంభించి నిధులు కేటాయించాలని, అద్దె భవనాలలో నడుస్తున్న పాఠశాలలు, హాస్టల్స్ గురుకులాలకు, సొంత భవనాలు నిర్మించాలని, శిధిలావస్థలో ఉన్న పాఠశాలలకు, కళాశాలలకు మరమ్మతులు చేయాలని, విద్యార్థులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్, కాస్మోటిక్ చార్జీలు పెంచి పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని, విద్యాహక్కు చట్టం అమలు చేసి పేద విద్యార్థులకు 25 శాతం ఉచిత ప్రవేశాలు కల్పించాలని, రాష్ట్రంలో విద్యార్థి సంఘాల ఎన్నికలు నిర్వహించాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వారన్నారు. లేనిపక్షంలో రానున్న రోజుల్లో విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యేలు, మంత్రుల కార్యాలయాలను ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి గుండ్ల లక్ష్మీప్రసన్న, మహంకాళి శ్రీవర్ధన్, అనుప్ సాయి, అభిషేక్, చైత్ర, ఆదిత్య, మాహీన్, సాయి, అభిషేక్, గణేష్, గొడిసెల ప్రణీత్, సూర్య ప్రకాష్, రాహుల్, రోహిత్, జశ్వంత్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular