Thursday, July 30, 2026

Buy now

నీట్ పేపర్ లీకేజీకి నిరసన: ఉస్మానియా యూనివర్సిటీ వద్ద దీక్ష చేపట్టిన తెలంగాణ రక్షణ సేన విద్యార్థి నేతల అరెస్ట్

హైదరాబాద్: నీట్ (NEET) పరీక్ష పేపర్ లీకేజీ ఘటనను నిరసిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ఎదుట తెలంగాణ రక్షణ సేన విద్యార్థి విభాగం నాయకులు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష ఉద్రిక్తతకు దారితీసింది. దీక్ష కొనసాగుతున్న సమయంలో పోలీసులు అక్కడికి చేరుకుని విద్యార్థి నాయకులను అదుపులోకి తీసుకున్నారు.

నీట్ పరీక్షలో జరిగిన పేపర్ లీకేజీపై సమగ్ర దర్యాప్తు చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి నాయకులు నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. అయితే, అనుమతి లేకుండా ఆందోళన చేపట్టారనే కారణంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు.

ఈ సందర్భంగా తెలంగాణ రక్షణ సేన విద్యార్థి విభాగం నాయకులు మాట్లాడుతూ, “పోలీసులు తమను నిర్బంధించినా, అరెస్ట్ చేసినా విద్యార్థుల ప్రయోజనాల కోసం పోరాటం ఆగదని, నీట్ పేపర్ లీకేజీపై న్యాయం జరిగే వరకు తమ దీక్ష కొనసాగుతుందని” స్పష్టం చేశారు.ఈ ఘటనతో ఉస్మానియా యూనివర్సిటీ పరిసరాల్లో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Related Articles

spot_img

Most Popular