Thursday, July 30, 2026

Buy now

సింగరేణి కార్మికుల సంక్షేమానికి మరో ముందడుగు

* కిష్టాపురంలో ‘ఇల్లందు బంగ్లోస్’ సింగరేణి క్వార్టర్స్‌ను ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

సత్తుపల్లి: సింగరేణి ఏరియాలోని కిష్టాపురంలో నూతనంగా నిర్మించిన “ఇల్లందు బంగ్లోస్” సింగరేణి క్వార్టర్స్ ను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక & విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,సింగరేణి అభివృద్ధికి అసలైన బలం కార్మికులేనని,వారి సంక్షేమం, కుటుంబాల జీవన ప్రమాణాల మెరుగుదల ప్రజా ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు.

సింగరేణి కార్మికులు ప్రశాంతమైన, సురక్షితమైన, ఆధునిక వసతులతో కూడిన నివాసాల్లో జీవించాలనే లక్ష్యంతో ప్రభుత్వం మెరుగైన గృహ వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తోందన్నారు.కార్మికుల సంక్షేమంపై పెట్టే ప్రతి రూపాయి సింగరేణి భవిష్యత్తుపై చేసే పెట్టుబడేనని ఆయన స్పష్టం చేశారు.కార్మికుల సంక్షేమం బలోపేతమైతేనే సింగరేణి మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్న భట్టి విక్రమార్క, ఉద్యోగుల నివాసాలు, వైద్య సేవలు, విద్యా సౌకర్యాలు, ఇతర సంక్షేమ కార్యక్రమాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు.భవిష్యత్ తరాలకు సింగరేణిని మరింత బలమైన సంస్థగా అందించాలనే లక్ష్యంతో ఒకవైపు కొత్త బొగ్గు బ్లాక్‌ల సాధన, మరోవైపు కార్మిక సంక్షేమ కార్యక్రమాలను సమాంతరంగా అమలు చేస్తున్నామని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో సింగరేణి సంస్థ అధికారులు, ప్రజాప్రతినిధులు, కార్మిక సంఘాల ప్రతినిధులు, సింగరేణి ఉద్యోగులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular