Saturday, August 15, 2026

Buy now

65 లక్షల విలువైన 236 ఫోన్ల అందజేత.. ఎస్పీ సునీతా రెడ్డి

◆ సీఈఐఆర్ పోర్టల్ ద్వారా బాధితుల చెంతకు మొబైల్స్
◆ రికవరీ మేళాలో పోలీసు సిబ్బందికి ఎస్పీ అభినందనలు

ప్రజానావ,ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో: బాధితులు పోగొట్టుకున్న, చోరీకి గురైన రూ.65 లక్షల విలువైన 236మొబైల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేసి శుక్రవారం బాధితులకు అందజేశారు. వనపర్తి జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ‘మొబైల్ రికవరీ మేళా’లో ఎస్పీ సునీతారెడ్డి పాల్గొని ఫోన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… సిసిఎస్ సీఐ అశోక్ కుమార్ నేతృత్వంలో 3 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి, తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి నెల రోజుల్లో ఈ ఫోన్లను రికవరీ చేసినట్లు తెలిపారు. సీఈఐఆర్ పోర్టల్ ద్వారా సాంకేతికతను ఉపయోగించి ఈ ఏడాది మొత్తం 500 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందించామన్నారు. ఫోన్లు పోగొట్టుకున్న వారు వెంటనే ceir.gov.in పోర్టల్‌లో లేదా సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ​అనంతరం ఫోన్ల రికవరీలో ప్రతిభ కనబరిచిన సైబర్ వారియర్స్, టెక్నికల్ టీమ్ పోలీసు సిబ్బందికి ఎస్పీ క్యాష్ రివార్డులు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీలు గిరిబాబు, బాలాజీ నాయక్, సీఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular