◆ పందెం సుఖేందర్ రెడ్డి
ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో:తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏదుల మండల ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పందెం సుఖేందర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… హిందువులకు తొలి ఏకాదశి ఎంతో పవిత్రమైన రోజని, ఆ శ్రీమహావిష్ణువు అనుగ్రహంతో మండల ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ప్రతి ఇంట్లో ఆనంద నిలయాలు వెలిగి, రైతన్నలు పంటలతో కళకళలాడాలని ఆయన ప్రార్థించారు.

