Sunday, July 26, 2026

Buy now

ఆయుధ నైపుణ్యంతోనే ప్రజలకు భద్రత.. జిల్లా ఎస్పీ సునితా రెడ్డి

◆ పోలీసులకు ఆయుధ వినియోగంపై పట్టు తప్పనిసరి
◆ 10వ బెటాలియన్‌లో వనపర్తి పోలీసుల ఫైరింగ్ శిక్షణ పూర్తి

ప్రజానావ,ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో: ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణకు పోలీసులకు ఆయుధాల వినియోగంపై పూర్తి నైపుణ్యం ఉండాలని వనపర్తి జిల్లా ఎస్పీ సునితా రెడ్డి అన్నారు. శనివారం ఎర్రవల్లిలోని 10వ బెటాలియన్‌లో వనపర్తి జిల్లా పోలీసులకు నిర్వహించిన రెండు రోజుల వార్షిక ఫైరింగ్ శిక్షణ ముగిసింది. ఈ కార్యక్రమంలో ఎస్పీ స్వయంగా పాల్గొని అధికారులతో కలిసి ఫైరింగ్ చేసి తమ నైపుణ్యాన్ని పరీక్షించుకున్నారు. ఫైరింగ్‌లో ప్రతిభ చూపిన సిబ్బందిని అభినందించారు. ​ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసులు శారీరక దృఢత్వం, వృత్తిపరమైన క్రమశిక్షణతో పనిచేసి శాఖ ప్రతిష్ఠను పెంచాలని పిలుపునిచ్చారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ, రోజూ వ్యాయామం, క్రమం తప్పకుండా హెల్త్ చెకప్‌లు చేయించుకోవాలని సూచించారు. ఏవైనా సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తెస్తే పరిష్కరిస్తామని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ వీరారెడ్డి, ఆర్‌ఐ అప్పలనాయుడు, ఆర్‌ఎస్సై వినోద్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular